HYDRAA: రంగారెడ్డి జిల్లాలో హైడ్రా అధికారుల దూకుడు
HYDRAA: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో హైడ్రా అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. శివరాంపల్లి, రాఘవేంద్ర కాలనీల్లో తెల్లవారుజాము నుంచే భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభించారు.
HYDRAA: రంగారెడ్డి జిల్లాలో హైడ్రా అధికారుల దూకుడు
HYDRAA: రంగారెడ్డి జిల్లాలో హైడ్రా అధికారులు దూకుడు ప్రదర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కూల్చివేతలు చేపట్టారు. శివరాంపల్లి, రాఘవేంద్ర కాలనీల్లో భారీగా అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. భారీ పోలీస్ బందో బస్తు మధ్య హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటలకో అధికారంలోకి దిగిన అధికారులు భారీ పోలీసు బందో బస్తు మధ్య ఆపరేషన్ ప్రారంభించారు.
అక్రమంగా నిర్మించిన నాలుగు నుండి ఐదు అంతస్తుల భవనాలను లక్ష్యాంగా చేసుకుని కూల్చివేతల పర్వం కొనసాగించారు. జేసీబీల సహాయంతో భవన నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. హైడ్రా కూల్చివేతలతో కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులతో బాధితులు వాగ్వాదానికి దిగుతున్నారు.
Next Story




