HYDRAA: పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యం: మరో రెండు వారాలు ‘హైడ్రా ప్రజావాణి’ వాయిదా..!

HYDRAA: హైడ్రా ప్రజావాణి కార్యక్రమానికి మరో రెండు వారాల పాటు విరామం ప్రకటిస్తూ కమిషనర్ ఎ.వి. రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 7 Jun 2026 10:30 AM IST
HYDRAA
X

HYDRAA: పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యం: మరో రెండు వారాలు ‘హైడ్రా ప్రజావాణి’ వాయిదా..!

HYDRAA: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ‘హైడ్రా ప్రజావాణి’ కార్యక్రమానికి మరో రెండు వారాల పాటు విరామం ప్రకటిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. జూన్ 8, జూన్ 15వ తేదీల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడదు.

గతంలో ప్రజల నుంచి వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలనే లక్ష్యంతో.. మే 11వ తేదీ నుండి వరుసగా నాలుగు సోమవారాల పాటు ప్రజావాణికి విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ నెల 8వ తేదీన (సోమవారం) ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఇంకా కొన్ని ముఖ్యమైన పాత ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సి ఉన్నందున ఈ గడువును మరో రెండు వారాల పాటు పొడిగించాల్సి వచ్చిందని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియ పూర్తిగా పూర్తయిన తర్వాత, జూన్ 22వ తేదీ సోమవారం నుండి హైడ్రా ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని కమిషనర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కాబట్టి బాధితులు, ఫిర్యాదుదారులు ఈ తాజా మార్పును గమనించి, హైడ్రా కార్యాలయానికి రావద్దని హైడ్రా వర్గాలు కోరాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story