IAS Officers Transfer: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

IAS Officers Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌ నియమితులవగా, రాహుల్‌ బొజ్జా, శైలజా రామయ్యర్‌లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 26 Jun 2026 4:02 PM IST
IAS Officers Transfer
X

IAS Officers Transfer: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

IAS Officers Transfer: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పరంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ (IAS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బదిలీల్లో పలువురు సీనియర్ అధికారులకు అత్యంత కీలకమైన శాఖల బాధ్యతలను అప్పగించారు.

ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్‌.శ్రీధర్‌ నియమితులయ్యారు. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాను నియమించారు. దీనితో పాటు ఆయనకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ నియమితులయ్యారు. ఆమెకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో పాలనా యంత్రాంగాన్ని మరింత వేగవంతం చేయడంలో భాగంగానే ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story