Bodhan: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్ సీజ్ చేసిన అధికారులు

Bodhan: బోధన్ పట్టణంలోని బాబా గార్డెన్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను సీఐ వెంకట్ నారాయణ్ పట్టుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 7:06 PM IST
Bodhan
X

Bodhan: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్ సీజ్ చేసిన అధికారులు

Bodhan: పట్టణం లోని బాబా గార్డెన్ వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక టిప్పర్ ను ఆదివారం తెల్లవారు జామున పట్టణ సీ ఐ వెంకట్ నారాయణ్ పట్టుకున్నారు. సాలురా మండలం మందార్న నుండి Ts 07 u h 1222 నంబర్ గల టిప్పర్ ను పోలీసులు పట్టుకున్నారు. నుండి ఇసుక ను ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న టిప్పర్ ను తెల్లవారు జామున పట్టుకుని విచారణ చేపట్టగా ఎలాంటి అనుమతులు లేక పోవడం తో పాటు రాత్రి వేల ఇసుక ను అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్దారించారు. TS 07 u h 1222 నంబర్ గల టిప్పర్ ను పోలీసులు పట్టుకున్నారు.

వర్ని మండలం కు చెందిన వ్యక్తి తో పాటు సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన కొందరు తరచూ ఇసుక రాత్రి వేళల్లో తరలిస్తున్నారని అధికారుల విచారణ లో తేలింది. రుద్రూర్ సర్కిల్ పరిధిలో లో ని ఓ పోలీస్ అధికారికి మామూళ్లు ముట్ట చెప్తూ తరచూ ఇసుక అక్రమంగా రవాణా కు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఒక పక్క అధికారులు ఇసుక అక్రమ రవాణకు కళ్లెం వేసేందుకు చర్యలు చేపడుతున్న ప్పటికి మరో పక్క ఇసుక సురులు తమ కార్యాన్ని చక్క బెట్టుకుంటున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. పట్టుకున్న వాహనాల పై కఠిన చర్యలు తీసుకున్నట్లయితే అక్రమ రవాణాను అరికట్టే అవకాశం ఉంటుంది.

బ్లాక్ లో ఇసుక రావాణ : మంజీరా పరివాహ ప్రాంతం నుండి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఒక చోట డబ్బు చేసి ప్రతిరోజు టిప్పర్ల ద్వారా రాత్రి వేళల్లో తరలిస్తూ ఇసుక సురులు సొమ్ము చేసుకుంటున్నారు.

ఇందిరమ్మ లబ్ధిదారులకు దక్కని ఇసుక: నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం కల్దుర్కి, రెంజల్ మండలం నీల, సాలూరు మండలం మందర్న, పోతంగల్ మండలం సుంకిని, కోడిచెర్ల, హంగర్గ గ్రామాల నుండి ప్రతి రోజు ఇసుక జోరుగాక్రమాల రవాణా జరుగుతుంది. పోలీసులు సైతం ఇసుకసురులకు ప్రోత్సహిస్తూ మామూలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేవు. ఫలితంగా ఇందిరమ్మల అధికారులకు ఇసుక దొరకకపోవడంతో ఒక్కో ట్రాక్టర్ కు రూ. 6000 చొప్పున డబ్బులు చెల్లించి బ్లాక్ లో ఇసుకను వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story