V Hanumantha Rao: సీఎం నో చెప్పినా.. హన్మంతరావు తగ్గేదేలే!

V Hanumantha Rao: నెక్లెస్ రోడ్ రోటరీ వద్ద జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 27 Nov 2026 10:44 AM IST
V Hanumantha Rao
X

V Hanumantha Rao: సీఎం నో చెప్పినా.. హన్మంతరావు తగ్గేదేలే!

V Hanumantha Rao: నెక్లెస్ రోడ్ రోటరీ వద్ద గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నేత వి. హన్మంతరావు, ఎలాగైనా ప్రసంగించాలనే పట్టుదలతో చివరి నిమిషంలో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు.

సభ ముగిసే సమయానికి వేదికపైకి చేరుకున్న వీహెచ్, సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి నమస్కారం పెడుతూ తనకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

వీహెచ్ అభ్యర్థనకు ప్రతి నమస్కారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, తాను అత్యవసరంగా నాగర్‌కర్నూల్ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, సమయం లేదని సున్నితంగా బదులిచ్చారు.

అయినప్పటికీ పట్టువదలని హన్మంతరావు, ప్రసంగించే అవకాశాన్ని వదులుకోలేదు. ప్రధాన సమావేశం ముగిసిన వెంటనే ‘వందన సమర్పణ’ (Vote of Thanks) పేరుతో మైక్ అందుకుని తన ప్రసంగాన్ని పూర్తి చేసి సభికులను ఆకట్టుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.