Btech Student: హైదరాబాద్‌లో జగిత్యాల బీటెక్ విద్యార్థి మిస్సింగ్.. కాచిగూడ రైల్వే స్టేషన్ సీసీటీవీలో దృశ్యాలు!
Btech Student: జగిత్యాలకు చెందిన బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి హైదరాబాద్‌లో అదృశ్యమయ్యాడు.
Btech Student: హైదరాబాద్‌లో జగిత్యాల బీటెక్ విద్యార్థి మిస్సింగ్.. కాచిగూడ రైల్వే స్టేషన్ సీసీటీవీలో దృశ్యాలు!
Btech Student: భాగ్యనగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగ కలలతో చదువుకుంటున్న ఒక ఇంజినీరింగ్ విద్యార్థి మిస్సింగ్ కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లాకు చెందిన రాహుల్ అనే బీటెక్ విద్యార్థి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదంటూ అతని ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణను ముమ్మరం చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాకు చెందిన రాహుల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సైదాబాద్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేట్ బాయ్స్ హాస్టల్‌లో నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఉంటూ ఇంజినీరింగ్ (బీటెక్) చివరి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, మే 27వ తేదీన హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన రాహుల్.. తిరిగి రూమ్‌కు చేరుకోలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకుని పోలీసులను ఆశ్రయించారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న సైదాబాద్ పోలీసులు రాహుల్ మొబైల్ సిగ్నల్స్, పరిసర ప్రాంతాల సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒక కీలక ఆధారం లభ్యమైంది. రాహుల్ చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చి.. ‘ఎంఎంటీఎస్’ (MMTS) రైలు ఎక్కినట్లు స్టేషన్ సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టమైంది. ఆ రైలు ఎెక్కి అతడు ఎక్కడికి వెళ్లాడనే కోణంలో పోలీసులు తదుపరి రైల్వే స్టేషన్ల నిఘా కెమెరాలను తనిఖీ చేస్తున్నారు.
మరోవైపు రాహుల్ చదువుతున్న ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లిన పోలీసులు అక్కడ కూడా ఆరా తీశారు. అతని స్నేహితులు, తోటి విద్యార్థులను అడిగి వివరాలు సేకరించారు. కాలేజీలో సదరు అబ్బాయికి ఒక అమ్మాయితో తీవ్రమైన గొడవ జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఆ మనస్తాపంతోనే రాహుల్ ఎక్కడికైనా వెళ్లిపోయాడా? లేక ఈ అదృశ్యం వెనుక మరేదైనా బలమైన కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.




