Jagtial: బిఆర్ఎస్, బీజేపీలది ఫెవికల్ బంధం.. ప్రభుత్వ విప్ శ్రీనివాస్
Jagtial: జగిత్యాలలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అగ్రనేతలపై నిప్పులు చెరిగారు.
Jagtial: బిఆర్ఎస్, బీజేపీలది ఫెవికల్ బంధం.. ప్రభుత్వ విప్ శ్రీనివాస్
Jagtial: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బిఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. కేటీఆర్, హరీష్ రావుల అహంకారపూరిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
*రాజకీయ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్ కేటీఆర్: ఎమ్మెల్యే సంజయ్ కుమార్*
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. "కేటీఆర్ రాజకీయంగా నీది క్రాస్ బ్రీడ్. మీ అహంకారం, అక్రమ సంపాదన, బలుపు వల్లే 2023లో ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారు. కేసీఆర్, కేటీఆర్ రాజకీయాల వల్లే వెలమ జాతి పరువు పోయింది. వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న చరిత్ర మీది, అలాంటిది ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అది రాజకీయ వ్యభిచార కొంపలా అనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయించింది మీరు కాదా? నాది రాజకీయ కుటుంబ నేపథ్యం, నీలా అక్రమ సంపాదనతో వచ్చిన అహంకారం కాదు," అని ధ్వజమెత్తారు.
*బిఆర్ఎస్, బీజేపీలది ఫెవికల్ బంధం: విప్ ఆది శ్రీనివాస్*
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, అధికారం పోయినా కేటీఆర్, హరీష్ రావులకు ప్రజల సమస్యల కంటే బురద చల్లడమే పనిగా మారిందని విమర్శించారు. "వీరిద్దరూ కోడిగుడ్డు మీద ఈకలు పీకే నాయకులు, పచ్చి అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్. లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు గుండు సున్నా రావడం ఖాయం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. బిఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నాయని, వారిది విడదీయలేని ఫెవికల్ బంధమని" విమర్శించారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు.
*సిరిసిల్ల నేరెళ్ల దళితుల అన్యాయంపై చర్చకు సిద్ధమా?: మంత్రి అడ్లూరి లక్ష్మణ్*
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, గత పదేళ్లు తామే రాజులమని విర్రవీగిన బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. "నక్కల్లా ఫామ్ హౌస్ లో దాక్కున్న నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోతే రాని కేసీఆర్, ఇప్పుడు గాలి మోటార్ లో తిరుగుతున్నారు. కేటీఆర్ కు దమ్ముంటే ధర్మపురిలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలి. నేను సిరిసిల్ల నేరెళ్ల దళితులకు జరిగిన అన్యాయంపై మాట్లాడతాను, సమాధానం చెప్పే ధైర్యం ఉందా? రేపు నిర్వహించే సభ జీవన్ రెడ్డి గారి చేరిక సభనా లేక మీ అక్రమ సంపాదనతో పెట్టుకున్న డబ్బా సభనా అని" నిలదీశారు.
*ముఖ్య అంశాలు
* కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ తోడు దొంగలు: విప్ ఆది శ్రీనివాస్.
* కేటీఆర్ రాజకీయంగా నీది క్రాస్ బ్రీడ్: ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
* ధర్మపురి అభివృద్ధిపై చర్చకు రావాలని కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి సవాల్.
* అక్రమ సంపాదనతో సభలు నిర్వహించడం కాదు, ప్రజలకు సమాధానం చెప్పాలి.
* రాబోయే ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయం.




