ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు అధిక లాభాలు.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల: వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు లాభసాటి పంటల వైపు మళ్లాలని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 March 2026 2:04 PM IST
ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు అధిక లాభాలు.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
X

ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు అధిక లాభాలు.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల: వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు లాభసాటి పంటల వైపు మళ్లాలని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రైతు విజ్ఞాన యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

సిద్దిపేట ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి రైతుల ప్రయాణం:

జగిత్యాల జిల్లాకు చెందిన ఆయిల్ పామ్ సాగు రైతులు సాగు మెళకువలు, శిక్షణ మరియు మార్కెటింగ్ అంశాలపై అవగాహన పొందేందుకు సిద్దిపేట జిల్లా నరిమెట్టలోని ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో వస్తున్న నూతన సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం ఆయిల్ పామ్ పంటకు అత్యధిక డిమాండ్ ఉందని, దీనిని సాగు చేయడం ద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని తెలిపారు.

ఆయిల్ పామ్ తో పాటు అంతర పంటలు సాగు చేయడం వల్ల అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. జిల్లాలోని రైతులు ఈ విజ్ఞాన యాత్రను సద్వినియోగం చేసుకొని, తమ క్షేత్రాల్లో ఆధునిక పద్ధతులు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ ఛైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత, సాంకేతిక ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్, హార్టికల్చర్ అధికారి స్వాతి మరియు జిల్లా రైతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story