Jagtial: కేటీఆర్‌పై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు
Jagtial: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Jagtial: కేటీఆర్‌పై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు
Jagtial: జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రెస్‌మీట్ నిర్వహించగా, ఇందులో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ రాజకీయంగా ఒక క్రాస్ బ్రీడ్ అని, కేసీఆర్ మరియు కేటీఆర్ చేస్తున్న రాజకీయాల వల్ల వెలమ జాతి పరువు మొత్తం గంగలో కలిపిపోయిందని ఆయన మండిపడ్డారు. 2023లో బిఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రాకపోవడానికి కేటీఆర్ అహంకారం, ఆయన అక్రమ సంపాదనతో వచ్చిన బలుపు మాటలే ప్రధాన కారణమని సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.
ముఖ్యంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ.. అప్పట్లో చంద్రశేఖర్ గౌడ్ కు టికెట్ ఇచ్చి, వెనుక నుండి జీవన్ రెడ్డికి సపోర్ట్ చేసిన చరిత్ర కేటీఆర్ ది అని, ఆనాడు పార్టీలో క్రాస్ ఓటింగ్ చేయించిన కేటీఆర్ ది ఏ బ్రీడ్ అని ఆయన నిలదీశారు. తనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమని గుర్తు చేస్తూనే.. నైతికత గురించి మాట్లాడే కేటీఆర్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు దాన్ని రాజకీయ వ్యభిచార కొంప అనాలా అని అత్యంత కఠినమైన పదజాలంతో సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో పాటు ముఖ్య నేతలు పాల్గొని జిల్లా అభివృద్ధి మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.




