Jammikunta: అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం: జమ్మికుంటలో భారీగా బీజేపీ నేతల నిర్బంధం!
Jammikunta: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న జమ్మికుంట బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
Jammikunta: అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం: జమ్మికుంటలో భారీగా బీజేపీ నేతల నిర్బంధం!
జమ్మికుంట: తెలంగాణ బడ్జెట్‌ను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పిలుపునిచ్చిన 'చలో అసెంబ్లీ' ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్‌కు తరలివెళ్తున్న జమ్మికుంట బీజేపీ శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
అరెస్టయిన వారిలో ప్రముఖులు:
జమ్మికుంట పోలీసులు చేపట్టిన ఈ ముందస్తు అరెస్టుల్లో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, కైలాసకొటి గణేష్, రాజేష్ ఠాకుర్, మోడం రాజు, రాచపల్లి ప్రశాంత్, గుర్రం పరుశురాం, తుర్పాటి శంకర్, మెడిపల్లి మహేష్, ఉడుగుల మహేందర్, మురికి మహేష్, బోజ్జ శరత్, పంజాల అనిల్ తదితరులు ఉన్నారు.
బడ్జెట్ అంకెల గారడీ - కొలకాని రాజు:
అరెస్ట్ అనంతరం కొలకాని రాజు మరియు శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ తప్పా.. ఇందులో రైతులకు, విద్యార్థులకు, వృద్ధులకు ఎలాంటి ప్రయోజనం లేదని వారు విమర్శించారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేయడానికే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చామని, దానిని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నారు:
ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టు చేసి, ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని చూస్తోందని వారు ఎద్దేవా చేశారు. ఇటువంటి పిరికి చర్యలకు బీజేపీ భయపడదని, కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని నేతలు హెచ్చరించారు.




