Hyderabad: అంబేద్కర్ కలలు కన్న సమాజం ఇదేనా.. జయప్రకాష్ నారాయణ

Hyderabad: హైదరాబాద్ లక్డీకాపూల్‌లో జరిగిన సదస్సులో జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు. విద్యా వ్యవస్థ నాణ్యతపై విమర్శలు.

GIRI, CENTRAL ZONE
Published on: 13 April 2026 6:46 PM IST
Hyderabad
X

Hyderabad: అంబేద్కర్ కలలు కన్న సమాజం ఇదేనా.. జయప్రకాష్ నారాయణ

Hyderabad: ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో లేనంత అధ్వాన స్థితిలో మన పాఠశాలవిద్య వవస్థ ఉందని. ఇది అంబేద్కర్ ఆశించిన సమాజం కాదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ అన్నారు. పాఠశాల విద్య కోసం ప్రభుత్వాలు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్న నాణ్యమైన విద్య అందడం లేదన్నారు.

హైదరాబాద్ లక్డికపుల్ లోని ఓ హోటల్ లో మహాజన శక్తి ఆధ్వర్యంలో భారతదేశం కోసం అంబేద్కర్ కన్న కల ఏమి జరిగింది, ఇంకా ఏమి మిగిలి ఉంది? అనే అంశంపై జరిగిన సమావేశంలో జయప్రకాష్ నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని డా.సురేందర్ బాబు అంబేద్కర్ పై రచించిన పాటను జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..

దేశంలో నిర్మాణాత్మకంగా కుల నిర్ములన జరగాలంటే , అందరికి సమాన అవకాశాలు దక్కాలని , అది పాఠశాల విద్య నుండే ప్రారంభం అవుతుందన్నారు. అంబేద్కర్ ఈ జాతి నిర్మాణం కోసం అద్భుతమైన రాజ్యంగాన్ని అందించారని. కానీ పాలకులు రాజ్యాంగ విలువలను కాపాడటంలో విఫలం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఎన్నికల్లో డబ్బు, కులం మాత్రమే ప్రధాన భూమిక పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

వాటి మధ్య సమర్ధవంతమైన నాయకులు నిలబడలేక పోతున్నారని తెలిపారు. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వ్యవస్థ మారుతుందని, అందుకు యువత ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. మన వ్యవస్థలో 80 శాతం వరకు వారి వారి కులలలోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయని. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల మనసును గ్రహించి వారు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని స్వేచ్ఛ ఇవ్వాలన్నారు.

అంబేద్కర్ కలలు కన్న దేశంగా మారాలంటే కుల వ్యవస్థ అనేది నిర్ములన జరగాలని జయప్రకాష్ నారాయణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని డా.సురేందర్ బాబు అంబేద్కర్ పై రచించిన పాటను జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story