మంత్రుల బుజ్జగింపులు బేఖాతర్.. తగ్గేదే లేదన్న జీవన్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడుతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఆయనను బుజ్జగించినా ఫలించలేదు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 March 2026 2:50 PM IST
Jeevan Reddy
X

మంత్రుల బుజ్జగింపులు బేఖాతర్.. తగ్గేదే లేదన్న జీవన్ రెడ్డి

జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "దేవుడు శాసించాడు.. మానవుడు అనుసరిస్తాడు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

మంత్రుల బుజ్జగింపులు విఫలం?

జీవన్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ స్వయంగా జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీని వీడొద్దని, సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

తగ్గేదే లేదంటున్న సీనియర్ నేత:

మంత్రులు గంటల తరబడి చర్చలు జరిపినప్పటికీ, జీవన్ రెడ్డి తన పట్టు వీడటం లేదని తెలుస్తోంది. "ఎవరొచ్చి మాట్లాడినా తగ్గేదే లేదు" అని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీలో తన ప్రాధాన్యత తగ్గడం, స్థానిక రాజకీయాల్లో చేరికలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story