Telangana Rashtra Sena: సంచలనం: కవిత కొత్త పార్టీ పేరు 'TRS'!

Telangana Rashtra Sena: మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌ వేదికగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. తన నూతన రాజకీయ పార్టీ పేరును 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS)గా ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

Arun Chilukuri
Updated on: 25 April 2026 11:02 AM IST
Telangana Rashtra Sena
X

Telangana Rashtra Sena: సంచలనం: కవిత కొత్త పార్టీ పేరు 'TRS'!

Telangana Rashtra Sena: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష రాజకీయాల్లోకి తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. శనివారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మునీరాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభ సాక్షిగా ఆమె తన నూతన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు.

మళ్ళీ 'టీఆర్‌ఎస్‌' తెరపైకి..

మునీరాబాద్‌ సభకు హాజరైన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన కవిత, తన పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) అని వెల్లడించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 'TRS' అనే సంక్షిప్త నామం, ఇప్పుడు మళ్లీ కవిత రూపంలో రాజకీయ తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై ప్రజల గొంతుకను బలంగా వినిపించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story