Pargi: పరిగిలో కాడ్లాపూర్ రైతుల ఆందోళన తీవ్రరూపం!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో కాడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితుల ఆందోళన. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై బీజాపూర్ హైవేపై బైఠాయించి నిరసన.

WAZID, PARIGI
Published on: 13 Sept 2026 6:52 AM IST
Pargi
X

Pargi: పరిగిలో కాడ్లాపూర్ రైతుల ఆందోళన తీవ్రరూపం!

PARGI: వికారాబాద్ జిల్లా పరిగిలో కాడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది.ఇండస్ట్రియల్ పార్క్ కోసం కాడ్లాపూర్ రైతులు భూములు ఇచ్చారని అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మేము భూములు ఇచ్చేదే లేదు... మా అనుమతి లేకుండా భూములు ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఎలా చెబుతారు?” అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా కాడ్లాపూర్ భూ బాధితులు పరిగి బస్టాండ్ ముందు ఆందోళనకు దిగారు.హైదరాబాద్–బీజాపూర్ హైవేపై బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే డౌన్ డౌన్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ వద్దకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి... భూముల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మెల్యే వచ్చి హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు.ఉదయం నుంచి ఆందోళన కొనసాగుతున్నా... ఇప్పటివరకు రైతులు వెనక్కి తగ్గలేదు.

తిండి కూడా సరిగ్గా తీసుకోకుండా... అక్కడే సమోసాలు, చాయ్‌తో సరిపెట్టుకుంటూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు.కాడ్లాపూర్ రైతుల ఆందోళనతో పరిగి బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తమ భూములు తీసుకోవద్దని... తమకు న్యాయం చేయాలని... ఎమ్మెల్యే వెంటనే స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI