Hyderabad: జర్నలిజం కాదు.. అది బ్రోకరిజం! రాధాకృష్ణపై కాకాణి ఫైర్
Hyderabad: ఏబీఎన్ రాధాకృష్ణపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.
Hyderabad: జర్నలిజం కాదు.. అది బ్రోకరిజం! రాధాకృష్ణపై కాకాణి ఫైర్
Hyderabad: మీడియా ముసుగులో వైఎస్సార్సీపీ నాయకుల కుటుంబ సభ్యులను, మహిళలను కించపరిచే విధంగా అసభ్యకర రాతలు రాస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తీరుకు నిరసనగా హైదరాబాద్ లోని ఏబీఎన్ కార్యాలయం ముందు బైఠాయించి, నిరసన తెలియజేశారు వైసీపీ శ్రేణులు... మహిళల గౌరవానికి భంగం కలిగించేలా చెత్త రాతలు రాస్తున్న రాధాకృష్ణను, తప్పుడు కథనాలతో మనోభావాలు దెబ్బతీసినందుకు ఏబీఎన్ యాజమాన్యం, రాష్ట్ర మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి డిమాండ్ చేశారు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలపై ధ్వజమెత్తారు కాకాణి. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దాడులు చేస్తున్నారని, జర్నలిజం ముసుగులో బ్రోకరిజం తగదంటూ విమర్శించారు. ధైర్యం మా వారసత్వం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆస్తి అన్నారు. రాధాకృష్ణ మీకు నీతి, నిజాయితీ, పౌరుషం ఉంటే మమ్మల్ని నేరుగా ఎదుర్కోండి అంటూ సవాల్ విసిరారు కాకాణి. ఆంధ్రజ్యోతి పత్రిక మరియు మీడియాలో కనీస విలువలు, నైతికత లేని వార్తలను ప్రచురిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఉన్న ధైర్యం, వెన్నుముక, చంద్రబాబుకు లేవని చెప్పారు.
ఎన్టీఆర్ కష్టార్జితాన్ని, పార్టీని, పార్టీ గుర్తును దోచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒంటరిగా పోరాడి 40% ఓట్ల షేర్ సాధించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. దమ్ముంటే మమ్మల్ని రాజకీయంగా నేరుగా ఎదుర్కోండి, అసత్య ప్రచారాలు ఆపకపోతే భవిష్యత్తులో గట్టి గుణపాఠం చెబుతాం అని హెచ్చరించారు. పచ్చ పత్రికల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే, భవిష్యత్తులో తాము ఇచ్చే సమాధానాలకు చెవుల్లో సీసం పోసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఘాటుగా స్పందించారు. ఆంధ్రజ్యోతి పేపర్, టాయిలెట్ పేపర్ కంటే హీనం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు కాకాణి.
ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..
చంద్రబాబు నాయుడు తెల్లకాగితం మీద ఏమి రాసిస్తే, దాన్నే రాధాకృష్ణ, వార్తలుగా అచ్చేస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, జగన్ మోహన్ రెడ్డి పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాధాకృష్ణకు సవాల్ విసురుతున్నానని, దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ, ఇలా నీచమైన వార్తలు రాస్తూ, వ్యక్తిగత దాడులకు దిగడం దౌర్భాగ్యం అని అన్నారు. అసత్య ప్రచారాల వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతినదని, గతంలోనూ ఇలాంటివి ఎన్నో కుట్రలను తాము అధిగమించామని గుర్తు చేశారు కాకాణి.
రాధాకృష్ణ తన స్థాయిని మర్చిపోయి రాస్తున్న దిగజారుడు రాతలను, ప్రజలు గమనిస్తున్నారని, రాజకీయాల్లో నైతికత ముఖ్యం అని అన్నారు. జర్నలిజం అనే పవిత్రమైన వృత్తిని అడ్డం పెట్టుకుని రాధా కృష్ణ 'బ్రోకరిజం' చేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన గుండె ధైర్యం తమకు వారసత్వంగా వచ్చిందని, ఇటువంటి తప్పుడు కథనాలకు, వార్తలకు, వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ఎవ్వరు భయపడరని చెప్పారు.. రాధా కృష్ణా నీకు విజ్ఞత ఉంటే, కడుపుకు అన్నం తింటే, చెల్లికి,ఆలికి తేడా తెలియనటువంటి వార్తలు రాస్తున్నావు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాధాకృష్ణ వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే తమను వ్యక్తిత్వంగా, మానసికంగా, దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. రాధాకృష్ణ జర్నలిజాన్ని మరిచిపోయి, జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తున్నాడని అన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల గురించి మాట్లాడతావా? మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతావా ఎంత ధైర్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రాని వైఎస్సార్ సీపీ నాయకుల కుటుంబ సభ్యులను విమర్శల్లోకి లాగడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. కనీస విజ్ఞత ఉన్నవారెవరూ ఇటువంటి రోత పనులు చేయరంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన డైరెక్షన్ లో రాధా కృష్ణ వైఎస్ఆర్ సీపీ నాయకులను మానసికంగా, హింసించాలని చూస్తున్నాడని, ఇలాంటి ఉడత బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.
మహిళలు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే రోజు వస్తుందని, మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులకు మహిళలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మీకు ధైర్యం ఉంటే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోండి, అంతే తప్ప ఇలాంటి నీచమైన రోత రాతలు రాయకండి అంటూ హెచ్చరించారు. మిమ్మల్ని ఎదురు ప్రశ్నించే వారు లేరని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని చెప్పారు. మీకు ధైర్యం ఉంటే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొండి, రాజకీయంగా ఎదుర్కొనే శక్తి మీకు లేకపోతే గమ్మున మూల కూర్చోండి అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.


