Peddapalli: కటకటాల వెనక్కి దొంగలు.. బాధితుల చేతుల్లోకి ఫోన్లు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పోలీసులు CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్‌ను రికవరీ చేశారు. కునారం గ్రామానికి చెందిన సంధా శంకర్‌కు ఫోన్ అందజేత.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 March 2026 4:01 PM IST
Peddapalli
X

Peddapalli: కటకటాల వెనక్కి దొంగలు.. బాధితుల చేతుల్లోకి ఫోన్లు!

కాల్వశ్రీరాంపూర్: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కాల్వశ్రీరాంపూర్ పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను గుర్తించి బాధితుడికి అందజేశారు. కునారం గ్రామానికి చెందిన సంధా శంకర్ అనే వ్యక్తి తన ఫోన్‌ను పోగొట్టుకోగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కాల్వశ్రీరాంపూర్ పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన CEIR పోర్టల్‌లో ఫోన్ వివరాలను నమోదు చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ఫోన్ ఎక్కడుందో గుర్తించిన పోలీసులు, దానిని స్వాధీనం చేసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story