Kavitha: వేములవాడలో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్.. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు!
Kavitha: వేములవాడలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
Kavitha: వేములవాడలో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్.. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు!
Kavitha: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక రాజకీయ పరిణామాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
రాజన్న గుడిని కాంక్రీట్‌తో నిర్మిస్తూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని, కృష్ణశిలలతో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆలయంలో కోడెలు పశుగ్రాసం లేక చనిపోతుండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
నవంబర్ వరకు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలని, అడుక్కుంటారో కొనుక్కు వస్తారో ప్రభుత్వం రైతులకు కరెంట్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.
సిరిసిల్ల సెస్ (CESC) లో జరిగిన రూ.32 కోట్ల అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అగ్నిప్రమాదం పేరుతో ఫైల్స్ మాయం చేశారని ఆరోపించారు.
నేరెళ్ల బాధితుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వారిని మళ్లీ మోసం చేశారని మండిపడ్డారు. బాధితులకు కోటి రూపాయల పరిహారం, మూడు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ హిట్ జోడీ కాదని.. అది 'ఇడుపు కాయితం జోడీ' అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు దీటుగా పోరాడుతామని ప్రకటించారు.




