Choppadandi: శ్రీనివాస్ నియామకంతో చొప్పదండి కాంగ్రెస్ డిజిటల్ వింగ్‌లో కొత్త జోష్!

Choppadandi: చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా కళ్యాణపు శ్రీనివాస్ నియామకం. గాంధీభవన్ నుండి అధికారిక ఉత్తర్వులు జారీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 5:11 PM IST
Choppadandi
X

Choppadandi: శ్రీనివాస్ నియామకంతో చొప్పదండి కాంగ్రెస్ డిజిటల్ వింగ్‌లో కొత్త జోష్!

Choppadandi: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియా వారియర్స్‌ను నియమిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో, కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గానికి సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా కళ్యాణపు శ్రీనివాస్‌ను నియమిస్తూ గాంధీభవన్ నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ నియామకం ద్వారా పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సోషల్ మీడియా వేదికల ద్వారా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కళ్యాణపు శ్రీనివాస్ నియామకంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కొత్త ఊపిరి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story