Kamareddy: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్!
Kamareddy: కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జుక్కల్ మండలంలో పర్యటించారు. కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Kamareddy: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్!
జుక్కల్ (కామారెడ్డి): కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్. ఎ కిరణ్మయి లు శుక్రవారం జుక్కల్ మండలం లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రభుత్వం చేపట్టుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కింద జుక్కల్ మండలం లో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇళ్ల పనుల పురోగతిని సబ్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చెయ్యాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నాణ్యత తోపాటు ప్రతి లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం పనులను వేగవంతం చేసేలా అధికారులు చర్చలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జుక్కల్ మండలం లోని పలు గ్రామాల్లో నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనుల్లో మండల అధికారుల పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్సిజన్ పార్క్ ను సందర్శించి మొక్కలకు నీరు పోసిన కలెక్టర్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన తదనంతరం జుక్కల్ మండల కేంద్రం లోని దోస్త్ పల్లి రోడ్డు లో గల ఆక్సిజన్ పార్క్ ను సందర్శించి అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్క్ లో వృక్షాల సంరక్షణ, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై స్థానిక అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలకు నీరు పోశారు.
కె జి బి వి విద్యాలయ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
జుక్కల్ మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్. కిరణ్మయి లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు మెనూ ప్రకారం ప్రతి రోజు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు. శుక్రవారం రోజు మెనూలో క్యారెట్ కర్రి, సాంబారు, టమాట చారు, కోడి గుడ్డు, పెరుగు, నెయ్యి అందిస్తున్నట్లు గమనించారు. ఆహార నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా విద్యాలయ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటిస్తూ వారి విద్య, వసతి, ఆహార తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
పాల్గొన్న అధికారులు,ప్రజాప్రతినిధులు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జుక్కల్ మండలం సందర్శనలో కలెక్టర్ తో కలిసి హౌసింగ్ పి డి. విజయ్ పాల్ రెడ్డి, డి ఇ ఓ రాజు, డి పి ఓ. మురళి, జడ్పి సి ఇ ఓ చందర్ నాయక్, తహసిల్దార్ మారుతి, ఎంపి డి ఓ శ్రీనివాస్, ఎంపీఓ రాము, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్, బస్సాపూర్ సర్పంచ్ భర్త సురేష్ గోండ, మాజి ఎ ఎం సి చైర్మన్. కె. సాయగౌడ్, మాజి సర్పంచ్లు రమేశ్ దేశాయ్, రవి పాటిల్, తదితరులు పాల్గొన్నారు.




