కామారెడ్డిలో మిస్టరీ: ఒకే కుటుంబంలో నలుగురు మాయం.. తల్లి, ముగ్గురు పిల్లల అదృశ్యంతో కలకలం!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 11 Jun 2026 10:58 AM IST
Kamareddy
X

కామారెడ్డిలో మిస్టరీ: ఒకే కుటుంబంలో నలుగురు మాయం.. తల్లి, ముగ్గురు పిల్లల అదృశ్యంతో కలకలం!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒకేసారి రహస్యంగా అదృశ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మాయమైన వారిలో తల్లితో పాటు ముగ్గురు మైనర్ పిల్లలు ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కామారెడ్డి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన లయ (31) అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, లయతో పాటు ఆమె సంతానమైన బిందు (16), శివ (13), చిన్న కుమార్తె దివిజ (8) లు అకస్మాత్తుగా ఇళ్లనుంచి కనిపించకుండా పోయారు. ఒకేసారి ఇంట్లోని నలుగురు సభ్యులు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తక్షణమే అప్రమత్తమయ్యారు.

బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు పట్టణంలోని పలు పరిసర ప్రాంతాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో జల్లెడ పట్టినప్పటికీ వారి ఆచూకీ ఎక్కడా లభించలేదు. దీంతో చేసేదేమీ లేక బాధితులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మిస్ అవ్వడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. లయ కుటుంబంలో ఏవైనా ఘర్షణలు జరిగాయా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ఆచూకీని వేగంగా కనుగొనేందుకు గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే లయ వాడుతున్న మొబైల్ ఫోన్ యొక్క కాల్ డేటా (CDR), చివరి లొకేషన్‌ ఆధారంగా పోలీసులు క్లూస్ సేకరించే పనిలో పడ్డారు. పట్టణ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story