Medak: విద్యార్థినుల ఇబ్బందులు తొలగిస్తాం.. మున్సిపల్ చైర్మన్ భరోసా
Medak: మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధికా భూపతి రాజు జిల్లా నర్సింగ్ కళాశాల మరియు హాస్టల్‌ను సందర్శించారు.
Medak: విద్యార్థినుల ఇబ్బందులు తొలగిస్తాం.. మున్సిపల్ చైర్మన్ భరోసా
Medak: జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజు తెలిపారు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సూచన మేరకు నర్సింగ్ కళాశాలను హాస్టల్ ను సందర్శించడం జరిగిందని సందర్శించడం జరిగిందని విద్యార్థినులతో మాట్లాడటం జరిగిందని వారి సమస్యలను తెలుసుకొని ఎమ్మెల్యే రోహిత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.
ముఖ్యంగా హాస్టల్ లో టాయిలెట్స్ ఒకటి ఉండటం మూలంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే టాయిలెట్స్ నిర్మాణం చేపడతామని నాణ్యమైన భోజనం చేయుటకు విశాల పైన వంట రూమ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి బాత్రూంలను పెంచడం జరుగుతుందని నర్సింగ్ ఆవరణలో పందులు.
పాములు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి జాలి ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు విద్యార్థులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని త్వరలో ఎమ్మెల్యే సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత భూపతిరాజు తదితరులు పాల్గొన్నారు.




