Dubbaka: మహిళలకు ఆత్మరక్షణ విద్య 'కరాటే' అత్యవసరం

Dubbaka: దుబ్బాక సిద్ధార్థ స్కూల్‌లో యువర్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు.

Chindam Karunakar, Dubbak
Published on: 13 April 2026 7:19 PM IST
Dubbaka
X

Dubbaka: మహిళలకు ఆత్మరక్షణ విద్య 'కరాటే' అత్యవసరం

Dubbaka: శరీరక, మానసిక దృఢత్వానికి కరాటే అత్యంత అవసరమని కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని సిద్ధార్థ కాన్సెప్ట్ స్కూల్‌లో యువర్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు.

ఈ పరీక్షలకు యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్,సకినాల లక్షిత పరిశీలకులుగా వ్యవహరించారు. సిద్దిపేట, దుబ్బాక నుంచి సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 20 మంది విజేతలుగా నిలిచి సర్టిఫికెట్లు, బెల్ట్‌లు సొంతం చేసుకున్నారు.

బ్రౌన్ బెల్ట్: ప్రజ్వల, హర్షవర్ధన్ బ్లూ బెల్ట్: నిశాల్, విశ్రుద్, చక్రధర్,

గ్రీన్ బెల్ట్: ఆరోవ్, సర్వజ్ఞ, అక్షయ వర్ధన్

ఆరెంజ్ బెల్ట్: ప్రచురిత, ప్రణవి, వశిష్ట, విశ్వతేజ్, సాత్విక్, హర్షిత, రిషిఅఖిల్, కళ్యాణ్ తేజ్,

యెల్లో బెల్ట్: అభిరామ్, అక్షర, మయూక, హరిణి

ఈ కార్యక్రమం యువతలో ఆత్మరక్షణ భావనను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story