Karimnagar: ఎండిపోతున్న పంటలు.. పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
Karimnagar: కరీంనగర్ జిల్లా పోరండ్ల గ్రామంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంపై కలెక్టర్ చిత్ర మిశ్రా సీరియస్ అయ్యారు.
Karimnagar: ఎండిపోతున్న పంటలు.. పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
Karimnagar: ఇరిగేషన్ డివిజన్ -2 అధికారుల నిర్లక్ష్యం వల్ల పోరండ్ల గ్రామంలోని 200 ఎకరాల పంట ఎండిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డివిజన్ -2 పరిధిలో ఉన్న ఎల్ -4 కెనాల్ కు లింకు ఉన్న సబ్ కేనా ల్ L-14 కెనాల్ ద్వారా పోరండ్ల గ్రామంలో సుమారు 200 నుంచి 300 ఎకరాల ఆయకట్టు ఉన్నది. గత సంవత్సరం నీరు రావడంతో రైతులందరూ పంట వేసుకోవడం జరిగింది.
గతం వలె ఈసారి కూడా నీరు వస్తాయని ఆశతో సుమారు రెండు వందల పైచిలుకు ఎకరాలలో 60 నుంచి 70 మంది రైతులు వరి మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. డిసెంబర్ వరకునీరు విడుదల చేసిన అధికారులు తరువాత విడుదల చేయడం లేదు. ఇప్పటికీ సంబంధిత డీఈగారికి ఈ ఈ కు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవడంలేదని కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు ఫీల్డ్ మీద సందర్శన చేయకుండా సరిపడా నీరు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పోరాండ్ల గ్రామంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా కెనాల్ కాల్వ పై అనేకమంది అక్రమ దారులు నీటి చౌర్యానికి పాల్పడితే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.? ఇరిగేషన్ అధికారుల ప్రోత్బలంతోనే కెనాల్ గండిపెట్టి నీటి చౌరర్యానికిగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులు పర్యావక్షణ చేయకపోవడం వల్లే కెనాల్ చివర్లో ఆయకట్టులో ఉన్న పోరండ్ల గ్రామ రైతాంగం పంటలు తీవ్రంగా ఎండిపోయినవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో గతంలో రెండు సార్లు దరఖాస్తు చేసిన కలెక్టర్ గారి ఆదేశాలను కూడా లెక్కచేయకుండా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే గ్రామానికి నీళ్లు రావడం లేదన్నారు.
దీనిపైన స్పందించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా గారు వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఇంజనీర్ సదాశివ గారితో మాట్లాడి ఎందుకని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు? రైతన్నకి నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంటనే అధికారులు కెనాల్పైన పర్యవేక్షణ చేసి చివరి ఆయకట్టు వరకు నీరందే విధంగా కృషి చేయాలని ఆదేశించడం జరిగింది.. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించకుంటే రైతాంగం అంతా ఐక్యంగా నీరచ్చేంత వరకు పోరాడుతామని తెలియజేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో గ్రామ రైతులు ఆశోద రాజు కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి జనార్దన్ రెడ్డి, విజయేందర్ తదితరులు పాల్గొన్నారు.


