Karimnagar: మన్మోహన్ హయాంలో తక్కువ.. మోదీ హయాంలో చుక్కలు!

Karimnagar: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రచారం కేవలం మీడియాకే పరిమితమైందని, వాహనదారులకు ఆ లబ్ధి అందడం లేదని మల్యాల సుజిత్ కుమార్ విమర్శించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 March 2026 8:08 PM IST
Karimnagar
X

Karimnagar: మన్మోహన్ హయాంలో తక్కువ.. మోదీ హయాంలో చుక్కలు!

కరీంనగర్: పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించుకుని, మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకుని తగ్గినటువంటి ఆ యొక్క లబ్ధిని వాహనదారులకు అందించడం లేదని, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్ అన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా యధావిధిగా అవేదారుల కొనసాగుతూ ఉండడం విడ్డూరం. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 120 డాలర్లకు చేరినప్పటికీ అప్పుడు లీటర్ పెట్రోల్ 60 రూపాయలు డీజీలు 56 కి ఇచ్చిన రోజులు ఉండేవి తర్వాత నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత క్రూడ్ ఆయిల్ ధర 45 డాలర్లకు వచ్చినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఏ రోజు కూడా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు 90 దాటి 120 రూపాయలకు కూడా చేరిన సందర్భం దేశంలో చూశాము.

ఇప్పుడు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యధావిధిగా ధరలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇతర బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలకి ఈ విషయమై సంజాయిషీ ఇవ్వాలి, ముందు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ ను బిజెపి పాలిత ముఖ్యమంత్రులను కలిసి వారి ద్వారా అక్కడి ప్రజలకు లబ్ధి చేకూరేలా చూడాలని దాని తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశంపై మాట్లాడాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేస్తూ ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డరు. యుద్దం జరుగుతున్న వేల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రకటనలు ఇస్తూ అభద్రతా భావానికి గురిచేస్తుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story