Karimnagar: దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. రవీందర్ సింగ్‌పై అంజన్ కుమార్ ఫైర్!
Karimnagar: మంత్రి పొన్నం ప్రభాకర్ పై మాజీ మేయర్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని కరీంనగర్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ కొట్టిపారేశారు.
Karimnagar: దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. రవీందర్ సింగ్‌పై అంజన్ కుమార్ ఫైర్!
కరీంనగర్: పచ్చకామెర్లోనికి, లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్న చందంగా అవినీతి పరులు కూడ నీతి మంతులుగా వాఖ్యలు చేయడం చాలా విడ్డూరం అని 26 వ డివిజన్ కార్పోరేటర్, కరీంనగర్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మండి పడ్డారు. యూఐడిఎఫ్ నిధుల టెండర్లు రద్దు చేయబడ్డాయని వాటిలో మంత్రి వర్యులను పొన్నం ప్రభాకర్ పేరు ఉచ్ఛరిస్తూ ఆనవసరపు ఆరోపణలు చేస్తున్న మాజీ మేయర్ సర్థార్ రవీంధర్ సింగ్ పై శనివారం రోజు ఓ పత్రిక ప్రకటన ద్వారా వైద్యుల అంజన్ కుమార్ ద్వజమెత్తారు.
గత రెండు మూడు రోజులుగా పత్రికల్లో యుఐడిఎఫ్ నిధులు రద్దు చేయబడ్డాయని ఆరోపణలతో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని వెల్లడించారు. మాజీ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ మా మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనవసరపు ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.
అనవసరపు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం..
సంబంధిత నిధులకు సంబంధించి వాటి పనుల టెండర్లకు సంబంధించి మంత్రి కి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. నిధులను రద్దు చేయమని టెండర్లను క్యాన్సల్ చేయాలని మా మంత్రి ఎక్కడా చెప్పలేదని అన్నారు. నూతనంగా వీలినం చెందిన గ్రామాల డివిజన్ల అభివృద్ధి చెందాలని. నిధులను వినియోగించుకోవాలని తెలిపారే తప్పా ఎక్కడ వీటికి వ్యతిరేక స్వరం వినిపించలేదని తెలిపారు. పలువురు కార్పోరేటర్లు తమ డివిజన్ల అభివృద్ధి కొరకు ఆర్జీలు పెట్టుకోవాలని వాటిని వినియోగం చేస్కోవాలని సూచనలు చేశారని తెలిపారు.
అనవసరమైన రాద్ధాంతం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును ఉచ్ఛరిస్తూ అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సర్ధార్ రవీంధర్ సింగ్ మీ ప్రవర్తన మార్చుకో మా మంత్రి పై అనవసరపు ఆరోపణలు చేస్తే ఊరుకొమని హెచ్చరించారు. సెక్యులర్ పార్టీలో ఉండి మొన్నటి మేయర్ ఎన్నికలో నీ పాత్ర నీ ప్రమేయం నగర ప్రజలందరికీ తెలుసని మండి పడ్డారు.
మీరు ఏ రకంగా మద్దతు తెలిపి బీజేపితో కుమ్మక్కైయ్యారో నగర ప్రజలందరికీ తెలుసని చర్చించుకుంటున్నారని ద్వజమెత్తారు. మీరు చేసిన సైలెంట్ రాజకీయం ప్రజలకు తెలుసు,సిగ్గుతో తలదించుకోవాల్సిన రవీందర్ సింగ్ నీతులు మాట్లాడితే దయ్యాలు వేదాలు పలికినట్లు ఉందని అన్నారు. మా మంత్రి పై అనవసరపు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని తగిన బద్ది చెబుతామని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు హెచ్చరించారు.
Gemini sa




