Karimnagar: తెలంగాణ సీఎం కప్-2025 కరీంనగర్ విద్యార్థుల మెరుపులు
Karimnagar: సీఎం కప్-2025లో కరీంనగర్ జిల్లా రికార్డు. 55 మెడల్స్, 79.4 పాయింట్లతో రాష్ట్రస్థాయిలో మూడో స్థానం. విజేతలను అభినందించిన కలెక్టర్ చిత్రా మిశ్రా.
Karimnagar: తెలంగాణ సీఎం కప్-2025 కరీంనగర్ విద్యార్థుల మెరుపులు
Karimnagar: సీఎం కప్-2025 పోటీల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. సుమారు 44 విభాగాల్లో 55 మెడల్స్ సాధించిన కరీంనగర్ విద్యార్థులను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అభినందించారు.
సీఎం కప్ లో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ చాటినందుకు 79.4 పాయింట్లతో కరీంనగర్ జిల్లా మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాదులో నిర్వహించిన సీఎం కప్ విజేతల ఎంపిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా జిల్లా క్రీడాకారులు కప్ అందుకున్నారు.
క్రీడల్లో జాతీయస్థాయిలో రాణించేలా తీర్చేదిద్దాలి..
విజేతలుగా నిలిచిన క్రీడాకారులు, కోచ్ లు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో జాతీయస్థాయిలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులను తీర్చిదిద్దిన కోచ్ లను, కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల సిబ్బందిని, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, జనార్దన్ రెడ్డి, సభ్యులు రమేష్ రెడ్డి, యోగ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిధారెడ్డి, కోచ్ లు పవన్, శ్రీకాంత్, సంపత్, విక్రం, సాయి, ఇందిరా, కిష్టయ్య రామకృష్ణ, వికాస్, శ్యాం పాల్గొన్నారు.




