Karimnagar: లైన్ మెన్ శివకు తప్పిన ప్రాణాపాయం.. ఆసుపత్రిలో మేయర్ పరామర్శ!

Karimnagar: కరీంనగర్ అలుగునూరులో స్ట్రీట్ లైట్లు బిగిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైన లైన్ మెన్ శివను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆసుపత్రిలో పరామర్శించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 5:20 PM IST
Karimnagar
X

Karimnagar: లైన్ మెన్ శివకు తప్పిన ప్రాణాపాయం.. ఆసుపత్రిలో మేయర్ పరామర్శ!

Karimnagar: విధుల నిర్వహణలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాకు తగిలి గాయాలతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లైన్ మెన్ శివను మేయర్ కొలగాని శ్రీనివాస్ పరామర్శించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎలక్ట్రికల్ విభాగం లో లైన్ మెన్ గా పని చేస్తున్న శివ అలుగునూరులో స్ట్రీట్ లైట్ బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న మేయర్ కొలగాని శ్రీనివాస్ లైన్ మెన్ శివను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించాలని.

ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో. అధికారులు సిబ్బంది లైన్ మెన్ ను చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు. మేయర్ హుటా హుటిన హాస్పిటల్ కు చేరుకొని లైన్ మెన్ శివ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ దగ్గరుండి శివకు వైద్యులతో చికిత్స చేయించారు.

ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి..

మేయర్ శ్రీనివాస్ వైద్యులను శివ ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసి. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ. ఎలక్ట్రికల్ విభాగం లో పని చేసే సిబ్బంది. విధులు నిర్వహించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

ముఖ్యంగా స్ట్రీట్ లైట్లు బిగిస్తున్న సమయంలో సంబంధిత పోల్స్ కి విద్యుత్ సరఫరా లేకుండా చూస్కోవాలని ముందస్తు జాగ్రత్త చర్యలతో విధులు నిర్వర్తించాలని సూచించారు. స్ట్రీట్ లైట్స్ బిగించే సమయంలో అధికారులు కూడ స్థానికంగా ఉండి పర్యవేక్షణ చేయాలని సిబ్బంది పని చేసే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story