పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో కీలక మలుపు.. ధర్మపురి లాడ్జీలో దొంగల బస!
Karimnagar PMJ Jewellery Theft Case: కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు ధర్మపురిలోని లాడ్జీలో బస చేసి దోపిడీకి ప్లాన్ చేసినట్లు గుర్తించారు.
పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో కీలక మలుపు.. ధర్మపురి లాడ్జీలో దొంగల బస!
Karimnagar PMJ Jewellery Theft Case: కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దోపిడీకి ముందురోజు ధర్మపురిలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో నిందితుల బస చేసినట్టు గుర్తించారు. ఈ నెల 1 నుంచి 3వ తేదీ ఉదయం వరకు లాడ్జీలోనే బస చేసినట్టు గుర్తించారు. 3వ తేదీ ఉదయం లాడ్జి నుంచి వెళ్లి కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ దుకాణంలో దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్ కాల్ ఆధారంగా లాడ్జీలో తనిఖీలు నిర్వహించారు. లాడ్జీ యజమాని నుంచి వివరాలు సేకరించారు.
అలాగే.. ధర్మపురిలోని పలు లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లలోనూ క్షణ్ణంగా సోదాలు చేపట్టారు. నిన్న సాయంత్రం నుంచి ధర్మపురి పరిసర ప్రాంతాల్లో కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు.. ధర్మపురి శివారులోని పుష్కర ఘాట్ దగ్గర దుండగులు ఉపయోగించిన బైక్, హెల్మెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురితో పాటు బిర్పూర్ మండలాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దొంగలు బీర్పూర్ గోదావరి మీదుగా మహారాష్ట్రకు వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.




