Karimnagar: డ్రైవర్లకు పోలీసుల కంటి వెలుగు రేపు ఉచిత కంటి పరీక్షల శిబిరం!
Free Eye Camp in Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర పోలీసులు మార్చి 28న మధురానగర్‌లో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహిస్తున్నారు.
Free Eye Camp in Karimnagar: డ్రైవర్లకు పోలీసుల కంటి వెలుగు రేపు ఉచిత కంటి పరీక్షల శిబిరం!
Free Eye Camp in Karimnagar: కరీంనగర్ జిల్లాలో ప్రజల ఆరోగ్యంపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా గంగాధర పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రేపు అనగా మార్చి 28న గంగాధర మండలం మధురానగర్ గ్రామంలోని వీఏఎస్ గార్డెన్స్‌లో ఈ శిబిరం నిర్వహించనున్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ సీపీ గౌస్ ఆలం మార్గదర్శకత్వంలో సర్కిల్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు తమ కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన సూచనలు కూడా అందిస్తారని అధికారులు తెలిపారు.
ప్రజల భద్రతతో పాటు ఆరోగ్యాన్ని కాపాడేందుకు పోలీసుల ఈ వినూత్న చర్యకు స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.




