Karimnagar: కార్మికుల శ్రమను దోచుకుంటున్న సెక్యూరిటీ ఏజెన్సీలు
Karimnagar: కరీంనగర్లో సెక్యూరిటీ గార్డ్ల కష్టాలపై సిఐటియు (CITU) జిల్లా కమిటీ గళమెత్తింది.
Karimnagar: కార్మికుల శ్రమను దోచుకుంటున్న సెక్యూరిటీ ఏజెన్సీలు
కరీంనగర్: కోతి రాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో కరీంనగర్ జిల్లా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ & అలైడ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ సమావేశం ప్రధాన కార్యదర్శి ఉట్ల ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యూనియన్ అధ్యక్షులు పున్నం రవి మాట్లాడుతూ,
షాపింగ్ మాల్స్, బ్యాంకులు , ఏటీఎం, వాహనాల షోరూమ్స్ గోదాములు, హాస్పిటల్స్, డీమార్ట్, వాల్ మార్ట్, చిల్లర వర్తక వ్యాపారాల దుకాణాల వద్ద పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ స్వీపర్ అపార్ట్మెంట్లు పనిచేసే వాచ్మెన్ కు యజమానులు సెక్యూరిటీ ఏజెన్సీలు,7,000 నుండి 10,000 అతి తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు జీతాలు పెంచాలని కోరితే పోటీ కార్మికులను పనిలో పెట్టుకుంటున్నారు.
ఏజెన్సీలు మారినా కార్మికులను కొనసాగించాలి..
అకారణంగా తొలగించిన సెక్యూరిటీ గార్డ్స్,స్వీపర్, వాచ్మెన్, ఆఫీస్ బాయ్ వార్డ్ బాయ్, స్థానంలో ఇతర కార్మికులు పనిచేయవద్దని కోరారు. కార్మికులందరూ సిఐటియు చేరి అందరూ హక్కుల కొరకు పోరాటాలు చేయాలని తెలిపారు. ఫంక్షన్ హాల్ గార్డెన్ లో పనిచేసే టెంపరరీ సెక్యూరిటీ గార్డ్స్ కి, రోజుకి. 800 /రూపాయలు ఇవ్వాలని యూనియన్ కమిటీ సమావేశంలో నిర్ణయించిందిని తెలియజేశారు. రోజు 8 గంటలు పని విధానాన్ని అమలు చేసి, అదనపు పనికి పూర్తి పరిహారం అనగా కనీస వేతనం కంటే రెట్టింపు చెల్లించాలి.
సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా నియమించబడిన సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ,ఫోటో గుర్తింపు కార్డులు ఇవ్వాలి ,కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి. ఏజెన్సీలు మారినప్పటికీ సెక్యూరిటీ గార్డ్ కార్మికులను కొనసాగించాలని కోరారు. సెక్యూరిటీ గార్డు కార్మికులందరికీ యూనిఫామ్ భద్రత సామాగ్రి అయిన టార్చ్ లైట్ టోపీ ఉచితంగా అందించాలి. అర్హులైన కార్మికులకు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల పరుశురాం ,తోటి సత్తయ్య ,తండ్ర కొమురయ్య, సుంకరపల్లి ప్రవీణ్, కూర సురేష్, బోడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




