హెల్మెట్ లేని వాహనదారులకు గులాబీలు.. ట్రాఫిక్ పోలీసుల వినూతన ప్రయోగం
Karimnagar: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు వినూతనంగా స్పందించారు.
హెల్మెట్ లేని వాహనదారులకు గులాబీలు.. ట్రాఫిక్ పోలీసుల వినూతన ప్రయోగం
Karimnagar: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారిని గుర్తించి వారికి గులాబీ పువ్వులు అందించి మరొకమారు హెల్మెట్ లేకుండా తిరగకూడదని హెల్మెట్ మీకు సురక్షితమైన ప్రయాణమని వాహనదారులకు అవగాహన కల్పించారు.
నగరంలోని మంచిర్యాల చౌరస్తా ఏరియాలో ప్రతి వాహనదారునికి పువ్వులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ట్రాఫిక్ నియమాలు పాటిస్తే నీతో పాటు ఎదుటి వారు కూడా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటారని అన్నారు. నగరవ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాహనదారిలో చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తే రోడ్లపై ప్రమాదాలు జరగవని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా జీబ్రా క్రాస్, స్కూల్ జోన్, సిగ్నల్స్, ఓవర్ టేకింగ్, స్పీడ్ లిమిట్ బోర్డులను గమనించి వాహన దారులు వాహనాలు నడపాలని కోరారు. ప్రమాదాలు ఎక్కువగా రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితులు ఉన్నాయని కరీంనగర్ లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగాయని వాటి నివారణ కోసం ప్రతి ఒక్కరికి తమ వంతుగా కర్తవ్యం గా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు.




