Karimnagar: తిమ్మాపూర్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్ష.. సీఈవో శ్రీనివాస్ హాజరు
Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం జరిగింది.
Karimnagar: తిమ్మాపూర్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్ష.. సీఈవో శ్రీనివాస్ హాజరు
కరీంనగర్ జిల్లా: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై అవగాహాన కల్పించారు. ఎంపీడీవో రాజీవ్ మల్హోత్ర అధ్యక్షతన జరిగిన సమావేశానికి జడ్పీ సీఈవో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు శాఖల వారిగా నివేదికలను అందించారు. ప్రభుత్వ పరంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్దిపైన శాఖల వారిగా వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహా లక్ష్మీ పథకం, గృహ జ్యోతి, సన్న వడ్ల బోనస్, చేయూత ఫించను, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, మహిళలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, నూతన రేషన్ కార్డులు, ఆరోగ్యం, వైద్య, విద్యపై సంబంధిత శాఖల అధికారులు నివేదికలు సమర్పించి వివరాలను వెల్లడించారు.
శాఖల వారిగా గ్రామ, మండల స్థాయిలో లబ్ధిదారుల వివరాలను తెలిపారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందజేస్తామని, తప్పకుండా పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందుతాయని అధికారులు చెప్పారు. శాఖల వారిగా నివేదికలు అందించినపుడు సర్పంచులు గ్రామల వారిగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేసిన అభివృద్దిని, అందించిన సంత్రేమ ఫలాలను వివరిస్తూ, సంక్షేమ పథకాలు అందని వారి నుండి ధరకాస్తులు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతీ ఉద్యోగి కృషి చేయాలని కోరారు. రాబోవు విద్యా సంవత్సరం నుండి పాఠశాల, ఇంటర్ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం బ్రేక్ ఫాస్టుతోపాటు మద్యాహ్న భోజనమును అందిస్తుందని తెలిపారు. ఆర్థో వికలాంగులకు వాహనాలను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. గ్రామల్లో ఎలాంటి అవసరాలున్నా అధికారుల దృష్టికి సర్పంచులు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజీవ్ మల్హోత్ర, ఎంఈవో శ్రీనివాస్, ఏవో సురేందర్, సర్పంచ్ గోదరి శోభారాణి, ఆర్ఐ లు లక్ష్మారెడ్డి, రవీందర్, అధికారులు, ప్రధానోపాద్యాయులు, అంగన్ వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.




