Telangana: జాతీయ స్థాయిలో తెలంగాణకు అరుదైన గుర్తింపు!

Telangana: అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ వేడుకల్లో మంచిర్యాల జిల్లా కాసిపేట్ మండలం 100 శాతం అక్షరాస్యత సాధించి ఢిల్లీలో జాతీయ సత్కారం అందుకుంది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 9 Sept 2026 7:11 AM IST
Telangana
X

Telangana: జాతీయ స్థాయిలో తెలంగాణకు అరుదైన గుర్తింపు!

Telangana: 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలోని డా. బి.ఆర్. అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ ఏడాది “ప్రజలు, గ్రహం మరియు శ్రేయస్సు కోసం అక్షరాస్యత” అనే థీమ్‌తో కార్యక్రమం నిర్వహించారు. 100 శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్షరాస్యత ప్రాధాన్యతను వివరించారు.

తెలంగాణ నుంచి మంచిర్యాల జిల్లా కాసిపేట్ మండలం 100 శాతం అక్షరాస్యత సాధించిన మండలంగా జాతీయ స్థాయిలో ఎంపికైంది. ఈ సందర్భంగా కాసిపేట్ మండలానికి చెందిన లెర్నర్లు జ్యోతి, భూమమ్మ, హరిలాల్, వాలంటీర్లు రాజేశ్వరి, కవిత, రజిత, DRP బండ శాంభవి ఢిల్లీ వేడుకల్లో సత్కారం పొందారు.

మండలాన్ని 100 శాతం అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు నిర్వహించనున్న ULLAS మేళాలో తెలంగాణ రాష్ట్ర స్టాల్‌ను ఏర్పాటు చేసి, 100 శాతం అక్షరాస్యత సాధనకు అనుసరించిన కార్యాచరణ ప్రణాళిక, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాజాత ప్రదర్శనల ద్వారా తెలంగాణ విజయగాథను ప్రదర్శించనున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story