KCR: పెద్ది కుటుంబానికి కేసీఆర్ పెద్దదిక్కు.. బీఆర్ఎస్ తరఫున రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం!
KCR: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది.
KCR: పెద్ది కుటుంబానికి కేసీఆర్ పెద్దదిక్కు.. బీఆర్ఎస్ తరఫున రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం!
KCR: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పెద్దదిక్కుగా నిలిచింది. ఇటీవల అకాల మరణం చెందిన ఆయన కుటుంబానికి పార్టీ తరఫున రూ. 2 కోట్ల 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరి పిల్లల పేరు మీద చెరో రూ. 1 కోటి చొప్పున మొత్తం రూ. 2 కోట్లు వారి భవిష్యత్తు, చదువుల కోసం కేటాయించారు. వృద్ధాప్యంలో ఉన్న సుదర్శన్ రెడ్డి తల్లి శ్రీమతి అమృతమ్మ సంక్షేమం, వైద్య ఖర్చుల కోసం రూ. 25 లక్షలు ఆమె పేరు మీద బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. కేవలం ఆర్థిక సాయంతోనే సరిపెట్టకుండా, వారి కుటుంబ సంక్షేమాన్ని, పిల్లల చదువులను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై, కుటుంబ సంక్షేమానికి సంబంధించిన మరిన్ని చర్యలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీకి నమ్మకమైన సహచరుడిగా ఉన్న పెద్ది కుటుంబాన్ని ఎప్పటికీ విస్మరించబోమని కేసీఆర్ పునరుద్ఘాటించారు.




