Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ బడా గణేశుడు.. ప్రశాంతంగా ముగిసిన మహాగణపతి నిమజ్జనం!

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ బడా గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎన్డీఆర్‌ మార్గ్‌లోని హుస్సేన్‌సాగర్‌లో వేలాది మంది భక్తుల జయధ్వానాల నడుమ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరారు.

Arun Chilukuri
Published on: 25 Sept 2026 2:30 PM IST
Khairatabad Ganesh
X

Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ బడా గణేశుడు.. ప్రశాంతంగా ముగిసిన మహాగణపతి నిమజ్జనం!

Khairatabad Ganesh: హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఖైరతాబాద్‌ బడా గణేశుడి నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా భక్తులకు దర్శనమిచ్చిన గణనాథుడు.. శోభాయాత్ర పూర్తి చేసుకుని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమయ్యారు.

శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఖైరతాబాద్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర.. సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంది. యాత్ర ప్రారంభ సమయంలో దానం నాగేందర్ గణపతి ఎదుట డ్యాన్స్ చేసి సందడి చేశారు.

మార్గమధ్యంలో భక్తుల జయజయద్వావాలు, 'గణపతి బప్పా మోరియా' నినాదాలతో నగరమంతా మార్మోగింది. ఎన్డీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. మధ్యాహ్నం 2.15 గంటలకు భారీ క్రేన్ల సాయంతో మహాగణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో ఉత్సవం విజయవంతంగా ముగిసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.