Khammam CI : కామంతో ఖాకీ ఘాతుకం.. న్యాయం కోస వస్తే.. గర్భవతిని చేసి..!

Khammam CI : రక్షక భట నిలయమే ఆ మహిళకు నరకప్రాయంగా మారింది. భర్త వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ..

G Krishna
Published on: 19 May 2026 3:28 PM IST
Khammam-cI
X

Khammam-cI

Khammam CI : రక్షక భట నిలయమే ఆ మహిళకు నరకప్రాయంగా మారింది. భర్త వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన ఒక అభాగ్యురాలిపై స్వయంగా ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) కన్నేశాడు. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, న్యాయం చేస్తానంటూ నమ్మించి దగ్గరయ్యాడు. ఆపై ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు ఆమె గర్భవతి కావడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో సీసీఎస్ సీఐ రాజుపై కేసు నమోదు కావడంతో ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మహిళా పోలీస్ స్టేషన్‌లో మొదలైన కథ

అసలు వివరాల్లోకి వెళ్తే.. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో బానోత్ రాజు నాయక్ సీఐగా పనిచేస్తున్న సమయంలో ఈ కథ మొదలైంది. ఆ టైమ్‌లో ఒక వివాహిత తన భర్త తనను వేధిస్తున్నాడంటూ న్యాయం కోసం సదరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలికి రక్షణగా నిలవాల్సిన సీఐ రాజు.. ఆమె ఇచ్చిన కంప్లైంట్ కాపీ నుండి పర్సనల్ ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఇక అక్కడి నుండి ఆమెకు వరుసగా ఫోన్లు, మెసేజ్‌లు చేయడం స్టార్ట్ చేశాడు. నీకు నేనున్నాను, ఎలాగైనా న్యాయం చేస్తానంటూ మాయమాటలతో నమ్మించి, మెల్లగా ఆమెను తన వలలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను పూర్తిగా లొంగదీసుకున్నాడు.

గర్భవతిని చేసి బలవంతంగా అబార్షన్.!

ఈ క్రమంలోనే సీఐ రాజు నాయక్ చేతిలో మోసపోయిన బాధితురాలు గర్భం దాల్చింది. తాను ప్రెగ్నెంట్ కావడంతో ఇకనైనా తనను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని ఆమె సీఐపై ఒత్తిడి తెచ్చింది. అయితే అప్పటివరకు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సీఐ, అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడమే కాకుండా, ఆమెకు బలవంతంగా కొన్ని అబార్షన్ ట్యాబ్లెట్లు మింగించాడు. దీంతో ఆ బాధితురాలికి తీవ్ర రక్తస్రావమై గర్భస్రావం (అబార్షన్) జరిగింది. ఆ తర్వాత కూడా ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా బెదిరింపులకు పాల్పడుతూ, విషయాన్ని దాటవేస్తూ వచ్చాడు.

భర్తతో విడాకులు ఇప్పించి మరీ మోసం

ఈ కేసులో మరో షాకింగ్ నిజం ఏమిటంటే.. సదరు బాధితురాలికి ఇటీవలే కోర్టు ద్వారా ఆమె భర్త నుండి అఫీషియల్ గా విడాకులు మంజూరయ్యాయి. అయితే ఆమెకు భర్త నుండి త్వరగా విడాకులు ఇప్పించేందుకు కూడా ఈ సీఐ రాజు నాయకే వెనక ఉండి నడిపించినట్లు తెలుస్తోంది. బాధితురాలి భర్తపై పోలీస్ పవర్‌తో తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి, బలవంతంగా విడాకులు ఇప్పించాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భర్త దూరం కావడం, సీఐ కూడా పెళ్లికి నో చెప్పడంతో ఆ మహిళకు ఏం చేయాలో పాలుపోలేదు.

ఖమ్మంలో కేసు నమోదు.. డీజీపీ ఆఫీస్‌కు అటాచ్

ఇక సీఐ రాజు నాయక్ తనను పూర్తిగా మోసం చేశాడని గ్రహించిన బాధితురాలు ఈనెల 7వ తేదీన ధైర్యం చేసి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చింది. విచారణ జరిపిన లీగల్ అఫీషియల్స్.. సీఐ రాజు నాయక్ ఆ మహిళను లైంగికంగా, మానసికంగా వేధించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో అతనిపై టూటౌన్ పీఎస్‌లో క్రిమినల్ కేసు బుక్ చేశారు. ఈ మ్యాటర్ ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో తీవ్ర సంచలనంగా మారడంతో ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఖమ్మం సీసీఎస్ లో పనిచేస్తున్న సీఐ బానోత్ రాజు నాయక్‌ను తక్షణమే అక్కడి నుండి బదిలీ చేస్తూ, హైదరాబాద్‌లోని డీజీపీ (DGP) కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు సంచలన ఆర్డర్స్ జారీ చేశారు. బాధితురాలికి పూర్తి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story