Kind India NGO: విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట.. ప్రభుత్వ పాఠశాలలకు అండగా 'కైండ్ ఇండియా'!
Kind India provides safe drinking water to Govt Schools: పేద పిల్లలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా 'కైండ్ ఇండియా' ఫౌండేషన్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
Kind India NGO
Kind India NGO: పేద పిల్లలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా 'కైండ్ ఇండియా' ఫౌండేషన్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధుల నుంచి విద్యార్థులను రక్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లను అందిస్తోంది. పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంటే పిల్లల్లో అనారోగ్యం తగ్గి.. పాఠశాలకు హాజరు శాతం పెరగడమే కాకుండా వారి చదువు మీద కూడా మంచి ప్రభావం ఉంటుందని సంస్థ భావిస్తోంది.
తాజాగా బోరబండలోని నాట్కో గవర్నమెంట్ హై స్కూల్, ప్రభాత్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండు యూవీ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌లను కైండ్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ కుందా ప్రతాప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా పూర్తి స్థాయి నీటి సరఫరా మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. పైపింగ్ సిస్టమ్, వాటర్ స్టోరేజ్ ట్యాంకులు, గంటకు 1000 లీటర్ల సామర్థ్యంతో పనిచేసే యూవీ ఫిల్ట్రేషన్ యంత్రాలు, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంకులు, విద్యార్థులకు సులభంగా నీరు అందేందుకు అనేక ట్యాపులు ఏర్పాటు చేశారు. ఈ రెండు పాఠశాలల కోసం సుమారు రూ.2 లక్షలు ఖర్చయింది.
ఈ ఆర్వో ప్లాంట్ల ద్వారా 1,800కు పైగా విద్యార్థులు, సిబ్బంది లబ్ధి పొందనున్నారు. పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులు ఆరోగ్యం మెరుగుపడుతుందని, రోజు పాఠశాలకు వచ్చి మంచి ఫలితాలు సాధిస్తారని ఇండియా ఫౌండేషన్ ఆశిస్తోంది.
కైండ్ ఇండియా ఫౌండేషన్ వచ్చే ఏడాదిలో 100 ఆర్‌ఓ సిస్టమ్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఐదు పాఠశాలల్లో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. బోరబండతో పాటు నాచారం, మౌలాలి తిరుమల నగర్ ప్రాంతాల్లో కూడా ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసింది.
కైండ్ ఇండియా సంస్థ తన సేవలను రోజురోజుకు విస్తరిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ.. జనాల్లో మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలుస్తున్న 'కైండ్ ఇండియా'పై ప్రశంసల వర్షం కురుస్తోంది. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు కోసం కైండ్ ఇండియా ఫౌండేషన్ చేపడుతున్న ఈ కార్యక్రమం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. మరిన్ని వివరాల కోసం www.kindindia.in ను సందర్శించవచ్చు.




