Kishan Reddy: రేవంత్ వైఖరిపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. భారత వ్యతిరేకిని కలవాల్సిన అవసరం ఏంటి?

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 25 Aug 2026 5:45 PM IST
Kishan Reddy
X

Kishan Reddy: రేవంత్ వైఖరిపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. భారత వ్యతిరేకిని కలవాల్సిన అవసరం ఏంటి?

Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అనుమతి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తీవ్ర అర్ధరహితమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విదేశాంగ శాఖ ముందస్తు అనుమతి లేకుండానే సీఎం రేవంత్ రెడ్డి ఆదరాబాదరాగా పర్యటన ఖరారు చేసుకున్నారని విమర్శించారు.

న్యూయార్క్ మేయర్ మమ్దానీ భారత్‌కు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తి అని.. అలాంటి వ్యక్తిని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి కలవాలని అనుకోవడం సరైంది కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. విదేశీ పర్యటనల్లో సీఎంలు ఎవరిని కలుస్తున్నారు, దానివల్ల దేశానికి ఏం ప్రయోజనం చేకూరుతుందనేది విదేశాంగ శాఖ పరిశీలిస్తుందని తెలిపారు. కేవలం సాంకేతిక, పరిపాలనా కారణాల వల్లే అనుమతి నిరాకరించారని, దీనికి రాజకీయ రంగు పులమడం తగదని వ్యాఖ్యానించారు.

గతంలో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు, అలాగే సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు విదేశీ పర్యటనల అనుమతులు నిరాకరించిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. విదేశీ పెట్టుబడులు రాబట్టడానికి అధికారులను కూడా పంపవచ్చని, సీఎం స్థాయిలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story