Jagtial: తెలుగు ప్రతిభ పోటీల్లో కోమటి కొండాపూర్ సర్కారు బడి విద్యార్థినిల ప్రభంజనం..!

Jagtial: జగిత్యాల జిల్లా కోమటి కొండాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని తెడ్డు నశ్విత మెట్టుపల్లి డివిజన్ స్థాయి తెలుగు ప్రతిభ పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 March 2026 12:29 PM IST
Jagtia
X

Jagtial: తెలుగు ప్రతిభ పోటీల్లో కోమటి కొండాపూర్ సర్కారు బడి విద్యార్థినిల ప్రభంజనం..!

ఇబ్రహీంపట్నం, జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోమటి కొండాపూర్ గ్రామ విద్యార్థినిలు మరోసారి నిరూపించారు. మెట్టుపల్లి రెవిన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించిన "తెలుగు ప్రతిభ పోటీల్లో" ఈ పాఠశాల విద్యార్థినిలు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

డివిజన్ స్థాయిలో ప్రథమ బహుమతి:

జూనియర్ విభాగంలో నిర్వహించిన ఈ పోటీల్లో కోమటి కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న తెడ్డు నశ్విత ప్రథమ స్థానంలో నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. అదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ధ్యానవేణి ప్రజ్వ (7వ తరగతి) కూడా ఈ పోటీల్లో చురుగ్గా పాల్గొని ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) రాము నాయక్ గారు విద్యార్థినిలకు మెమెంటో మరియు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.

గురువుల కృషి.. గ్రామస్తుల హర్షం:

విద్యార్థినిల ఈ విజయానికి గైడ్ టీచర్‌గా వ్యవహరించిన తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి దురిశెట్టి నర్మదా గారి కృషిని అందరూ కొనియాడారు. ఈ విజయం పట్ల ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి (MEO) బండారి మధు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. సుధారాణి హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం ఉపాధ్యాయులు అల్లకట్టు సత్యనారాయణ, భద్రకంటి వేణుగోపాల్, గురూడు విశాల్, ఉపాధ్యాయురాలు జ్యోత్స్న, అంగన్‌వాడీ టీచర్లు స్వరూప, సుమలతతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు విజేతలను ఘనంగా అభినందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story