Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ బయట.. బీజేపీ లోపల కుమ్మక్కై ఆందోళన
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ బయట, బీజేపీ లోపల కుమ్మక్కై ఆందోళనలు చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ బయట.. బీజేపీ లోపల కుమ్మక్కై ఆందోళన
Komatireddy Venkat Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ బయట ఆందోళనలు చేస్తుంటే, బీజేపీ సభ్యులు సభ లోపల ఉద్దేశపూర్వకంగా రచ్చ చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై సభా సమయాన్ని వృథా చేస్తున్నాయని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరుతూ ప్రభుత్వం లేఖ రాసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్లడం లేదని కోమటిరెడ్డి నిలదీశారు. 22ఏ భూముల సమస్యలు, ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు.
Next Story




