Revanth Reddy: దిల్లీ టూర్‌లో కొండా సురేఖ ఎపిసోడ్ క్లోజ్? కేబినెట్ నుంచి తప్పించడం ఖాయమేనా?
Konda Surekha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తేలనుంది.
Revanth Reddy: దిల్లీ టూర్‌లో కొండా సురేఖ ఎపిసోడ్ క్లోజ్? కేబినెట్ నుంచి తప్పించడం ఖాయమేనా?
Konda Surekha: తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన మంత్రి కొండా సురేఖ భవితవ్యంపై సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించే దిశగా హైకమాండ్‌తో ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది.
మంగళవారం ఉదయం దిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం కేంద్ర మంత్రులతో రాష్ట్ర ప్రాజెక్టులపై భేటీ కానున్నారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం సమావేశమై సురేఖ, చిన్నారెడ్డిలపై వచ్చిన క్రమశిక్షణ కమిటీ నివేదికపై చర్చించనున్నారు.
మంత్రి సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం, ఆమెను కేబినెట్ నుంచి తొలగించాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. సురేఖపై చర్యలు తీసుకోవద్దని కొందరు నేతలు ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ను కోరినప్పటికీ, ఆమె నుంచి ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది.




