Kondagattu: భారీగా అంజన్న ఆదాయం.. పెరిగిన భక్తుల రద్దీ

Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 17 April 2026 5:50 PM IST
Kondagattu
X

Kondagattu: భారీగా అంజన్న ఆదాయం.. పెరిగిన భక్తుల రద్దీ

Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే హుండీ ఆదాయం మరోసారి గణనీయంగా నమోదైంది. ఆలయంలో 17 రోజుల పాటు సమకూరిన హుండీలను శుక్రవారం ప్రత్యేకంగా లెక్కించారు.

ఈ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వాహణ అధికారి అంజనా రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. శ్రీ లలితా సేవా ట్రస్ట్ సభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొని హుండీలను పారదర్శకంగా లెక్కించారు. ఈ సందర్భంగా మొత్తం రూ.75,02,126 నగదు ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు.

హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఏఈవో హరిహరనాథ్, స్థానాచార్యులు కపిందర్, ప్రధానార్చకులు రామకృష్ణ, పర్యవేక్షకులు సునీల్, ఏఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు బ్యాంకు మరియు సెక్యూరిటీ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story