Karimnagar: జలకళ సంతరించుకోనున్న కొండాయపల్లి.. కాలువ మరమ్మతు పనులు షురూ!
Karimnagar: గంగాధర మండలం కొండాయపల్లిలో ధ్వంసమైన పురాతన కాలువకు మరమ్మతులు. సర్పంచ్ మల్యాల వినయ్ సాగర్ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు ప్రారంభం.
Karimnagar: జలకళ సంతరించుకోనున్న కొండాయపల్లి.. కాలువ మరమ్మతు పనులు షురూ!
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం కొండాయపల్లి గ్రామంలో ఉన్న ప్రధాన పురాతన కాలువ పూర్తిగా ధ్వంసం కావడంతో గ్రామ ప్రజలు చాలా కాలంగా నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమైన నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గ్రామ సర్పంచ్ మల్యాల వినయ్ సాగర్ ఆధ్వర్యంలో కాలువ మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి.
గ్రామ అభివృద్ధికి కీలకమైన ఈ కాలువ పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనులు పూర్తయిన తర్వాత గ్రామానికి సరైన నీటి సరఫరా అందడంతో పాటు వ్యవసాయానికి కూడా మళ్లీ చైతన్యం వస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Next Story




