Kothakota: కొత్తకోట అంబా భవాని దుర్గాదేవిగా దర్శనం!

Kothakota: కొత్తకోట అంబా భవాని దేవాలయంలో 8వ రోజు శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. అడ్డాకల నుంచి భవానీ మాలాధారులు పాదయాత్రగా విచ్చేశారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 18 Oct 2026 6:21 PM IST
Kothakota
X

Kothakota: కొత్తకోట అంబా భవాని దుర్గాదేవిగా దర్శనం!

Kothakota: పట్టణంలోని శ్రీ అంబా భవాని దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన ఆదివారం అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాల వితరణతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అడ్డాకల నుంచి పాదయాత్రగా భవాని మాలధారులు

దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వనపర్తి జిల్లా అడ్డాకల మండల కేంద్రానికి చెందిన సుమారు 40 మంది భవాని మాత దీక్షాధారులు పాదయాత్ర చేపట్టారు. అడ్డాకల నుంచి కొత్తకోటలోని శ్రీ అంబా భవాని ఆలయం వరకు భక్తిశ్రద్ధలతో పాదయాత్రగా చేరుకున్నారు.

అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు సురేశ్ శాస్త్రి, నవీన్ అయ్యగారు, సదాశివయ్య ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA