KTR: వాట్సాప్ అంకుల్స్ vs ఇన్‌స్టా పిల్లలు.. ప్రధాని మోదీపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
KTR: వాట్సాప్ అంకుల్స్.. ఇన్‌స్టా పిల్లలలో ఎవరు గెలిచారో చూశామని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
KTR: వాట్సాప్ అంకుల్స్ vs ఇన్‌స్టా పిల్లలు.. ప్రధాని మోదీపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
KTR: దేశంలో యువతరం కొత్త తరహాలో ఢిల్లీ వేదికగా కదం తొక్కిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎవరితో పెట్టుకోకూడదో, సరిగ్గా ఆ యువతరంతోనే పెట్టుకున్నారని ఆయన సరదాగా, వ్యాంగ్యంగా అన్నారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. సోషల్ మీడియా ప్రభావం మరియు మారుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడారు.
సామాజిక మాధ్యమాల శక్తి గురించి కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికరమైన అంశాలను లేవనెత్తారు... "వాట్సాప్ అంకుల్స్.. ఇన్‌స్టా పిల్లల మధ్య జరిగిన పోరులో ఎవరు గెలిచారో దేశం చూసింది. అర్థరాత్రి వేళ ప్రధాని మోదీ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. నేడు సోషల్ మీడియా ఉంటేనే ప్రభుత్వాల్లో జవాబుదారీతనం వస్తోంది." అని కేటీఆర్ అన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికి పైగా జెన్‌జీ (Gen Z) యువత ఓట్లు వేయబోతోందని, రాజకీయాల్లో వారి పాత్ర అత్యంత కీలకమని కేటీఆర్ స్పష్టం చేశారు. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సున్న నేటి యువత సంప్రదాయ వార్తాపత్రికలు లేదా టీవీ ఛానెళ్లను చూడటం లేదని చెప్పారు. నేటి తరం న్యూస్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ (Reels) రూపంలోనే చూస్తూ సమాచారాన్ని తెలుసుకుంటోందని కేటీఆర్ విశ్లేషించారు. సోషల్ మీడియా వేదికగా యువత ప్రశ్నించే తత్వాన్ని పెంచుకుందో అని, రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియానే రాజకీయ దిశానిర్దేశం చేస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.




