KTR: ముద్రగడ పద్మనాభం మరణంపై కేటీఆర్ సంతాప ప్రకటన!
KTR: కాపు ఉద్యమ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.
KTR: ముద్రగడ పద్మనాభం మరణంపై కేటీఆర్ సంతాప ప్రకటన!
KTR: ముద్రగడ పద్మనాభం మరణంపై కేటీఆర్ సంతాప ప్రకటన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన ఆయన, కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం పోరాడిన నేతగా నిలిచిపోతారు.శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, ముఖ్యంగా సామాజిక ఉద్యమాలకు తీరని లోటు.
ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను.
Next Story




