KTR: దిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్‌ఎస్.. మళ్లీ పట్టాలెక్కిస్తాం: ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్ ధీమా!

KTR: బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జెండా ఎగురవేశారు.

Arun Chilukuri
Published on: 27 April 2026 3:29 PM IST
KTR
X

KTR: దిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్‌ఎస్.. మళ్లీ పట్టాలెక్కిస్తాం: ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్ ధీమా!

KTR: తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత బీఆర్‌ఎస్) ఆవిర్భావం జరిగి నేటికి 25 ఏళ్లు (రజతోత్సవ ఏడాది) పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ భవన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గులాబీ జెండాను ఎగురవేసి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

జెండా ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అడుగడుగునా పోరాటాలు చేస్తూ, దిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని కొనియాడారు. "14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది" అని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ పాలనల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు బీఆర్‌ఎస్ పునరంకితమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీని మళ్లీ పట్టాలెక్కించి, ప్రజల పక్షాన పోరాటం చేయడం. కేసీఆర్ దార్శనికతతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని వెల్లడించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ఏకైక శక్తి బీఆర్‌ఎస్ మాత్రమేనని, కార్యకర్తలు ధైర్యంగా ఉండి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story