KTR: అసెంబ్లీలో సరదా సన్నివేశం.. రాజాసింగ్‌ను ఆటపట్టించిన కేటీఆర్!

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 16 March 2026 3:13 PM IST
KTR: అసెంబ్లీలో సరదా సన్నివేశం.. రాజాసింగ్‌ను ఆటపట్టించిన కేటీఆర్!
X

KTR: అసెంబ్లీలో సరదా సన్నివేశం.. రాజాసింగ్‌ను ఆటపట్టించిన కేటీఆర్!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అసెంబ్లీ లాబీల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య జరిగిన సరదా సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది.

రాజాసింగ్‌ను ఆటపట్టించిన కేటీఆర్

బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్.. అసెంబ్లీలోని బీజేపీ శాసనసభ పక్ష (BJLP) కార్యాలయంలో కూర్చుని ఉండటాన్ని కేటీఆర్ గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లిన కేటీఆర్.. "సస్పెండ్ అయ్యారు కదా, ఇంకా బీజేఎల్పీ కార్యాలయంలోనే ఎందుకు కూర్చున్నారు? బయటకు రండి" అంటూ రాజాసింగ్‌తో సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన రాజాసింగ్ మరియు ఇతర బీజేపీ నేతలు నవ్వులు చిందించారు.

ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన కేటీఆర్

ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కల్పించుకుని.. కేటీఆర్‌ను బీజేఎల్పీ కార్యాలయం లోపలికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే కేటీఆర్ తనదైన శైలిలో స్పందిస్తూ.. "నేను లోపలికి వస్తే లేనిపోని వార్తలు వస్తాయి" అని నవ్వుతూ ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే అయినా, ఇలాంటి ఆత్మీయ పలకరింపులు అసెంబ్లీలో ఆహ్లాదకర వాతావరణాన్ని నింపాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story