KTR: నేతన్నలను ఆదుకోండి.. డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ విజ్ఞప్తి!
KTR: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు.
KTR: నేతన్నలను ఆదుకోండి.. డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ విజ్ఞప్తి!
KTR: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఆర్థిక కష్టాల నుంచి నేతన్నలను గట్టెక్కించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సిరిసిల్ల పవర్ లూమ్పై ఉన్న సుమారు రూ.38 కోట్ల విద్యుత్ భారంతో పాటు, పేరుకుపోయిన బ్యాక్ బిల్లింగ్, సర్ఛార్జ్లను తక్షణమే మాఫీ చేయాలని కేటీఆర్ కోరారు.
గతంలో ఉన్న విధంగానే పరిశ్రమకు నిరంతర విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలని, పాత బకాయిలతో సంబంధం లేకుండా నేతన్నలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతో కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టే ప్రమాదం ఉందని, వారికి తక్షణమే ఆర్థిక వెసులుబాటు కల్పించి భరోసా ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.




