Dharmaram: అమరవీరురాలు రూపీ అక్క కుటుంబానికి పరామర్శ
Dharmaram: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో కామ్రేడ్ రంగబోయిన భాగ్య (రూపీ అక్క) కుటుంబ సభ్యులను నాయకులు పరామర్శించారు.
Dharmaram: అమరవీరురాలు రూపీ అక్క కుటుంబానికి పరామర్శ
Dharmaram: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో నమ్మిన సిద్ధాంతం కోసం అణగారిన పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు, మహిళల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన కామ్రేడ్ రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ అక్క కుటుంబాన్ని ఈరోజు పరామర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రూపీ అక్క చేసిన త్యాగం భారతదేశ చరిత్రలో ఒక వేగుచుక్కలా నిలిచి, పేద వర్గాలకు ఎప్పటికీ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆమె పోరాట స్పూర్తి భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
రూపీ అక్క గారికి తమ లాల్ నీల్ సలాం అర్పిస్తూ, ఆమె ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో INTUC RTC SWU మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆస ముత్యం గారు, బడుగు బలహీన వర్గాల నేత, దళిత నాయకుడు, మిడిదొడ్డి మాజీ జెడ్పిటిసి నర్మల చంద్రం గారు పాల్గొన్నారు.




